తెలంగాణ: ఇబ్రహీంపట్నం టిఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి నోటీసులు జారీ చేశారు. దీనితో ఆయన నేడు విచారణకు హాజరయ్యారు. రెండు గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. అతని బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.