శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పటికే రెండుసార్లు ఈడీ నోటీసులు అందుకున్న ఆయన.. విచారణకు హాజరు కాలేదు. జులై 27న ఈడీ కార్యాలయానికి రావాలని కోరగా.. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో హాజరు కాలేనని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆదివారం ఆయన ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించడం గమనార్హం.