ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు

ఇద్దరు మంత్రులకు హైకోర్టు నోటీసులు

0
92

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు అలాగే ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో పాటు, కన్వీనర్ జీఎన్ రావులకు హైకోర్టు నోటీసులను జారీ చేసింది….

ఇటీవలే అనేక సార్లు మంత్ర బొత్స సత్యనారాయణ రాజధాని విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే…. ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ రాష్ట్రంలో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరిస్తుందని అన్నారు… దీన్ని సవాల్ చేస్తూ అమరావతి ప్రాంత రైతులు పిటీషన్ వేశారు…

తాజాగా దీనిపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గా ప్రసాదరావు విచారణ చేపట్టి పలువురికి నోటీసులను జారీ చేసింది… మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలతో పాటు, కమిటీ కన్వీనర్ జీఎన్ రావులకు కమిటీ సభ్యులకు నోటీసులను అందించింది…