ఉత్తరాంధ్రలో ప్రజా చైతన్య యాత్రను చేసేందుకు వచ్చిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును ప్రజా సంఘాలు వైసీపీ నేతలు అడ్డుకున్నారు….
విశాఖ రాజధానిని వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ నేతలను ఉత్తరాంధ్రలో తిరగనివ్వమని అంటున్నారు… దీనిపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు.. ఇది ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ నాయకులు చేశారని ఆరోపించారు..
నిన్ననే తమకు అనుమతి ఇవ్వకుంటే వచ్చేవారము కాదని అన్నారు… ఎయిర్ పోర్ట్ లోపలే మమ్మల్ని ఆపి ఉంటే రోడ్డుపై ఇంత ఉద్రిక్తత ఉండేది కాదుకదాని అన్నారు.. ఓ పద్దతి ప్రకారం కుట్ర పడ్డారని ఆయన ఆరోపించారు తాము అనుమతి తీసుకుని వచ్చామని ఇక్కడినుంచి వెనుదిరిగేదిలేదని అన్నారు…