ఇది రా పౌరుషం అంటే…. నాగబాబు…

ఇది రా పౌరుషం అంటే.... నాగబాబు...

0
83

ఏపీలో స్థానిక స్థంస్థ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు హాట్ హాట్ సాగుతున్నాయి… గెలుపే లక్ష్యంగా చేసుకుని అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు… ఈక్రమంలో నామినేషన్ల వేసేందుకు వెళ్లిన ప్రతిపక్షాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే…

ఈ ఘటనపై టీడీపీ, జనసేన బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే తాజాగా జనసేన నేత ప్రముఖ నటుడు నాగబాబు కూడా స్పందించారు… ఇటీవలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఒక వీడియోను పోస్ట్ చేశారు… నామినేషన్ వేసేందుకు వచ్చిన ఒక వృద్దుడు తొడగొడుతూ ముందుకు వెళ్తున్నాడు…

పక్కన ఉన్న ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ రోడ్డుపక్కన ఒక కర్రతో దాడి చేసేందుకు ప్రయత్నించటం వృద్దుడు తొడగొడుతూ ముందుకు వెళ్తాడు… ఈ వీడియోను నాగబాబు ట్వీట్ చేశాడు… అది రా పౌరుషం అంటే వైసీపీ వారి గూండా గిరికి నిలబడ్డ పెద్దాయన అంటూ వ్యాఖ్యానించారు…