సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం..మళ్లీ సోమవారం విచారణ

0
61
Sonia Gandhi

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఈడీ విచారించింది. 2 గంటల పాటు జరిగిన ఈ విచారణలో మొత్తం 20 ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ఆరోగ్య కారణాలతో ఆమె చేసిన ప్రత్యేక విజ్ఞప్తిని ఈడీ అధికారులు పరిగణనలోకి తీసుకుని.. తొలిరోజు విచారణను త్వరగానే ముగించారు. ఆమె ఇంటికి వెళ్లేందుకు అనుమతించారు. మళ్లీ సోమవారం విచారణకు రావాలని సమన్లు జారీ చేశారు.