ఈ మాస్క్ లు వాడుతున్నారా డేంజర్ కేంద్రం హెచ్చరిక

ఈ మాస్క్ లు వాడుతున్నారా డేంజర్ కేంద్రం హెచ్చరిక

0
79

ఈ కరోనా సమయంలో ఏది పడితే అది పెద్ద ఎత్తున మాస్కులు వాడుతున్నారు, అయితే ఏది మంచిది ఏది సరైన రక్షణ ఇస్తుంది అనేది తెలియక చాలా మంది వీటిని వాడుతున్నారు, ఈ సమయంలో తక్కువ ధరకు వస్తున్నాయి కదా అని క్వాలిటీ లేనివి కూడా వాడుతున్నారు, అంతేకాదు పలు లేయర్ల మాస్కులు వస్తున్నా వాటి గురించి తెలియక ఏవో నాశిరకం వాడుతున్న వారు ఉన్నారు.

సమాజహితం కోసం చెప్పే మాట ఏమిటి అంటే, మంచి మాస్క్ మాత్రమే వాడాలి, అది కూడా వాష్ చేసుకుని వాడుకునేలా చూసుకోండి అంటున్నారు నిపుణులు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది ఈ మాస్క్ లగురించి.

కవాటం అంటే ఫిల్టర్ వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు..ఈ ఎన్-95 మాస్క్ లు చాలా మంది వాడుతున్నారు, వాటి వల్ల అంత ప్రయోజనం లేదని ఈ ఫిల్టర్ల వల్ల కూడా బయట గాలి నుంచి కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు, అయితే కర్చీఫ్ కట్టుకున్నా మంచి మాస్క్ వాడినా చేతులు దానిపై పెట్టకండి ఎప్పటికప్పుడు వాష్ చేయండి, మాములుగా ఓ 20 సార్లు కంటే ఏది ఎక్కువగా వాడద్దు అంటున్నారు నిపుణులు.