హుజురాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ముగిసింది. హుజురాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఒకటి రెండు మినహా అన్ని రౌండ్లలో ఈటల స్పష్టమైన ఆధిక్యాన్ని పొందారు. మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక 23,865 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై సంచలన విజయం సాధించారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అంతగా ప్రభావం చూపించలేకపోయింది.