గుడ్డు ధర ఎంత ఉంటుంది మహా అయితే అయిదు లేదా ఆరు రూపాయలు ఉంటుంది.. అంతకంటే దాటిన రికార్డు మనదేశంలో లేదు,ఇక అల్లం కూడా బాగా పెరిగితే కిలో రెండు వందలు ఉంటుంది లేదా 150 మించదు.. కాని కిలో అల్లం ఏకంగా 1000 రూపాయలు ఒక గుడ్డు ధర 30 రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా మరి కొనేవారికి ఇంకా కన్నీరు వస్తుంది.
ఈ రేట్లు ఎక్కడ అని ఆలోచన వస్తోందా, మన దాయాదీ దేశం పాకిస్ధాన్ లో ఈ రేట్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి..
ఇంకా క్వింటా గోధుమ ధర రూ.6,000కు చేరింది. ఇక పంచదార కిలో 100 రూపాయలు ఉంది, ఇక సిలిండర్లు లేక చాలా మందికి గ్యాస్ డెలివరీ సరైన సమయానికి రావడం లేదు.
దేశంలో చాలా చోట్ల చలికాలం కారణంగా గుడ్లకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో డజన్ గుడ్ల ధర రూ.350కు చేరింది. దీంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ధరలు నియంత్రించలేకపోతోంది అని విమర్శలు వస్తున్నాయి,
ఈ రేట్లు విని మన దేశంలో జనం ఆశ్చ్యపోయారు.