ఈ కరోనా వైరస్ తో ప్రపంచం షేక్ అవుతోంది, ఎవరికి అయినా వైరస్ ఉంటే మనకు సోకుతుంది అనే భయం అందరిలో కలుగుతోంది, అయితే ఈ వైరస్ ఎఫెక్ట్ తో ఇప్పుడు ప్రజారవాణా పూర్తిగా ఆగిపోయింది, ఇక రవాణాకి అవకాశం లేదు.బస్సులు రైళ్లు విమానాలు రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు.
అయితే లాక్ డౌన్ ఎత్తివేశాక ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే విమాన ప్రయాణాలు చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై ఇప్పటికే ఆ చర్యలపై దృష్టిసారించారు.
1.. విమానంలో అందించే భోజనాన్ని రద్దు చేస్తారని వార్తలు వస్తున్నాయి.
2..కేవలం ఫ్లైట్ లో నీళ్లు మాత్రమే అందిస్తారు
3.. లావెటరీలను సైతం పరిమితం సంఖ్యలో వాడనున్నట్లు చెప్పారు.
4.ప్రయాణికులు సామాజిక దూరం పాటించాలి
5. కచ్చితంగా అందరూ మాస్క్ ధరించాల్సిందే
6.. ప్రయాణికులకు తమ సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు.
7.. సిబ్బంది, ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి తర్వాతే టర్మినల్‌కు వెళ్లేందుకు అనుమతిస్తారు.
8..విడతల వారిగా విభజించి మెడికల్ టెస్టులు చేస్తారని తెలుస్తోంది ఈ జాగ్రత్తలు తీసుకోనున్నారని వార్తలు వస్తున్నాయి.