ఇక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను…. వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

ఇక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయను.... వైసీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం

0
60

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు… ఇక నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని కర్నూల్ జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్థర్ సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను ప్రజలకు ఏదో చేయాలని రాజకీయంలోకి వచ్చానని కానీ ఏదో అవుతుందని అన్నారు…..

తాజాగా ఆయన ఓ కార్యక్రమానికి హాజరు అయ్యారు… అయితే కనీసం సమాచారం లేకుండా వస్తున్నారని ఎమ్మెల్యే ఆర్థర్ పై కార్యకర్తలు ప్రశ్నించారు… ఇంటికి తిరిగి ఓట్లడిగిస్తే సమాచారం ఇవ్వకుండానే వస్తున్నారని కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు…

దీంతో ఆయన కార్యకర్తల తీరుపై ఆగ్రహం చెందారు… ఇంకోసారి ఓట్లు అడుక్కోనని ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని అన్నారు కార్యకర్తలు వచ్చినా రాకపోయినా వాళ్ల కాళ్ళు పట్టుకోనని ఏపని కావాలంటే కార్యకర్తలే తన దగ్గరకు రావాలని అన్నారు… ప్రజలకు ఏదో చేయాలని అనుకున్నానని కానీ ఏదో అవుతోందని అన్నారు ఆర్థర్…