ఇక రేషన్ సరుకులు ఇవ్వరు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులే ఎప్పటి నుంచంటే

ఇక రేషన్ సరుకులు ఇవ్వరు నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులే ఎప్పటి నుంచంటే

0
80

నెలనెల అత్యల్ప ఆదాయ వర్గాల వారికి పేదలకు రేషన్ ద్వారా అతి తక్కువ ధరకు సన్నబియ్యం, ఆయిల్ కందిపప్పు, కిరోసిన్ అందిస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, అయితే ఎన్నో సంవత్సరాలుగా ఈ పథకం నడుస్తోంది, చాలా స్టేట్స్ లో ఇది అక్రమార్కులకు కోట్ల రూపాయలు కొల్లగొట్లే విధంగా మారుతోంది, చాలా మంది రేషన్ తీసుకోకపోతే వీరే తమ ఖాతాలో వేసుకుంటున్నారు, ఇప్పుడు వేలిముద్ర వేస్తేగాని రేషన్ ఇవ్వని పరిస్దితి.. అయితే తాకట్టు వ్యాపారాలు గతంలో చేసేవారు రేషన్ కార్డులు తమ దగ్గర ఉంచుకుని లక్షల రూపాయలు ఆర్జించేవారు. కొందరు డీలర్లు కమీషన్లు దండుకునేవారు. కాని కేంద్రం ఇప్పుడు తాజాగా దీనిపై మరో సంచలన నిర్ణయం తీసుకుంటోందట.

రేషన్ కు బదులు నగదు బదిలీ పథకం తీసుకురావాలి అని కేంద్రం ఆలోచన చేస్తోందట..దీని ద్వారా ప్రజలు నాసిరకమైన బియ్యం, ముగ్గిపోయిన బియ్యం తినకుండా నాణ్యమైన బియ్యం తినచ్చు అని అలాగే అక్రమాలు జరగవు అని ఆలోచిస్తోందట. నెలకు సుమారు 700 రూపాయలు నలుగురు సభ్యులు ఉంటే వారి అకౌంట్లో నేరుగా నగదు వేసే ఆలోచనలో కేంద్రం ఉందట, దీని ద్వారా ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. డీలర్ల కమీషన్లు తగ్గుతాయి రవాణా భారం కూడా తగ్గుతుంది అని భావిస్తోంది, ముందుగా రెండు స్టేట్స్ లో దీనిని అమలు చేసి తర్వాత పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్రం భావిస్తోందట. మరి ఈ నిర్ణయం పై కొందరు బాగుంది అంటుంటే మరికొందరు మాత్రం వద్దు అంటున్నారు.