ఇక సౌదీలో అలాంటి శిక్ష ఉండదు రద్దు చేసిన సౌదీ రాజు

ఇక సౌదీలో అలాంటి శిక్ష ఉండదు రద్దు చేసిన సౌదీ రాజు

0
93

సౌదీ అరేబియా అంటేనే లగ్జరీ లైఫ్, అయితే ఇక్కడ ఏదైనా తప్పు చేస్తే వేసే శిక్షలు కూడా అలాగే ఉంటాయి, కాని తాజాగా ఇక్కడ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు, సౌదీరాజు, ఇక్కడ ఎవరైనా తెలిసి తప్పులు చేస్తే వారికి వేసే శిక్షలు ఏ దేశం కూడా ఇలా వేయదు, అంత దారుణంగా శిక్షలు వేస్తుంది.
ఈ శిక్షలపై సౌదీ అరేబియా, ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇక్కడ కొరడాదెబ్బలు శిక్షగా విధిస్తారు, అయితే ఎవరైనా అతి దారుణమైన తప్పులు చేసినా,మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, రహదారులపై రొమాన్స్ చేయడం వంటి నేరాలకు ఇక్కడ బహిరంగ కొరడా దెబ్బల శిక్షలను విధిస్తుంటారు. కాని ఇప్పుడు నేటి నుంచి ఈ కొరడా దెబ్బలు శిక్ష తీసేశారు.

ఇకపై ఈ శిక్ష విధించరు, ఈ తప్పులు చేస్తే వారికి జైలు శిక్ష విధిస్తారు. అంతేకాదు ఆ తప్పు ప్రకారం జరిమానా లేదా రెండూ విధించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు జనరల్ కమిషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. సౌదీ రాజు సల్మాన్, యువరాజు మహ్మద్ బిల్ సల్మాన్ ఆదేశాల మేరకు ఈ శిక్షను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయంతో మానవ హక్కుల సంఘం వారు ఇది మంచి నిర్ణయం అని స్వాగతించారు.