ఇక‌పై మీ బండికి ఇది లేక‌పోయినా చ‌లాన్ వేస్తారు త‌ప్ప‌క తెలుసుకోండి

ఇక‌పై మీ బండికి ఇది లేక‌పోయినా చ‌లాన్ వేస్తారు త‌ప్ప‌క తెలుసుకోండి

0
86

చాలా మంది బండి న‌డిపే స‌మ‌యంలో హెల్మెట్ పెట్టుకుంటే చాలు మ‌న‌ల్ని పోలీసులు ఆపరు అనుకుంటారు, కాని ఒక్కోసారి హెల్మెట్ ఉన్నా పోలీసులు బండి కాగితాలు అన్నీ చెక్ చేసి పంపుతారు, లైసెన్స్ , ఆర్సీ, ఇన్సూరెన్స్ . పొల్యూష‌న్ స‌ర్టిఫికెట్,హెల్మెట్ ఇవి లేకుండా బండి బ‌య‌ట‌కు వ‌స్తే ఫైన్ల మోత మోగుతుంది.

అయితే ఇప్పుడు ఇందులో స‌రికొత్త అంశం తెర‌పైకి వ‌చ్చింది, మీరు బండి బ‌య‌ట‌కు తీస్తే కచ్చితంగా మీ బైక్ కు సైడ్ మిర్ర‌ర్ ఉండాల్సిందే.. చాలా వరకు టూ వీలర్స్ కు సైడ్ మిర్రర్స్ అసలే ఉండవు.. స్టైల్ కోసమని ఈ అద్దాలు పెట్టుకోరు..

కాని ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి బండ్ల‌కు ఫైన్ వేస్తున్నారు, ఈ ఛ‌లాన్లు వేస్తున్నారు.మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ 177 సెక్షన్‌ కింద సైడ్‌ మిర్రర్‌ లేకుంటే వాహనాలకు ఈ-చలాన్ విధిస్తున్నారు, బైక్‌లకు సైడ్‌ మిర్రర్‌లు ఉండటం వల్ల వెనక నుంచి వచ్చే వాహనాలు కనిపించి జాగ్రత్తగా డ్రైవ్‌ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు చెబుతున్నారు, క‌చ్చితంగా సైడ్ మిర్ర‌ర్ మాత్రం బండికి ఉండాల్సిందే, అది మ‌నకే మంచిది.