అఖిల భారత యాదవ మహాసభ, జాతీయ యువజన కోఆర్డినేటర్ నియామకం

Elected All India Yadava Mahasabha, National Youth Coordinator

0
123

అఖిల భారత యాదవ మహాసభ జాతీయ యువజన కో-ఆర్డినేటర్ ఎంపిక నేడు జరిగింది. గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ ని ఈ పదవిలో నియమిస్తూ జాతీయ యువజన విభాగం అధ్యక్షులు ప్రదీప్ బెహెర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్బంగా యశ్వంత్ యాదవ్ మాట్లాడుతూ..శత జయంతోత్సవం చేరువలో ఉన్న అఖిల భారత యాదవ మహాసభ జాతీయ యువజన కోఆర్డినేటర్ గా నన్ను గుర్తించి నియమించినందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి జాతీయ యువజన కోఆర్డినేటర్ గా నియమించిన అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు, మాజీ ఎంపి గురూజీ ఉదయ్ ప్రతాప్ సింగ్ యాదవ్ కి, జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు సత్య ప్రకాష్ సింగ్ యాదవ్ కి, జాతీయ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చౌదరి యాదవ్ కి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బద్దుల బాబు రావు యాదవ్ కి, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్ కి, జాతీయ యువజన అధ్యక్షులు ప్రదీప్ బేహెర యాదవ్ కి, రాష్ట్ర కార్యదర్శి, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కి,రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు ఐ. రమేష్ యాదవ్ కి ఈ సందర్బంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

యాదవ సంస్కృతిని కాపాడే విధంగా తగిన కృషి చేస్తానని, యాదవ యువత జాగృతికై పని చేస్తానని, యువత చెడు మార్గానికి దూరంగా ఉండే విధంగా పలు కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు చేసే విధంగా కృషి చేస్తానని ఒక ప్రకటనలో తెలిపారు.

Appointment Letter 1