ఎన్నికల ఎఫెక్ట్ ఏపీలో 10 వ తరగతి పరీక్షలు వాయిదాపడే అవకాశం తేదీలు ఎప్పుడంటే

ఎన్నికల ఎఫెక్ట్ ఏపీలో 10 వ తరగతి పరీక్షలు వాయిదాపడే అవకాశం తేదీలు ఎప్పుడంటే

0
94

ఏపీలో స్ధానికసంస్ధల ఎన్నికలు జరుగనున్నాయి, దీంతో పదో తరగతి పరీక్షలు వాయిదా వేసుకుంటున్నట్లు బోర్డు అధికారులు చెప్పారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు.
ఇక ఎన్నికలు అయిన తర్వాత ఈ పరీక్షలు జరుగనున్నాయి అంటున్నారు.

ఎన్నికలు అయిన తర్వాత ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తారని తెలుస్తోంది.. ముందు మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, స్థానిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక శనివారం ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది..స్థానిక ఎన్నికలు మాత్రం బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. పంచాయతీతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తానికి పదోవతరగతి పరీక్షలు డేట్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి.