ఈ ప్రపంచంలో కుబేరుడు అంటే ముందు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ పేరు వినిపిస్తుంది, ఇక ఆయన ఆస్ధి సుమారు 190 బిలియన్ డాలర్లు, ఇక రెండోప్లేస్ లోకి ఎలాన్ మస్క్ చేరారు, ఈ ఏడాది అనూహ్యంగా ఆయన సంపద భారీగా పెరిగింది ఆయన అపర కుబేరుడిగా మారారు ఆ సంపద పెరగడంతో.
టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలు ఆయనకు ఈ ఏడాది దాదాపు మూడు వంతుల కొత్త ఆస్తిని సంపదను క్రియేట్ చేశాయి,
రోదసి యానం, విద్యుత్ ఆధారిత కార్లు వంటి వ్యాపారాలతో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ లాభాల బాటలో దూసుకుపోతున్నారు. ఇక బిల్ గేట్స్ సెకండ్ పొజిషన్లో ఉంటే ఆయన నుంచి మస్క్ ఈ రెండో జాబితాలో చేరారు.
మస్క్ నికర సంపద విలువ 127.9 బిలియన్ డాలర్లకు పెరిగింది. బిల్ గేట్స్ ఆదాయం 127.7 బిలియన్ డాలర్లు.టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల మార్కెట్ విలువ గత మూడు నెలలుగాభారీగా పెరిగింది, ఇక స్టాక్ మార్కెట్లో భారీగా పెరిగింది ఆయన సంపద.
ఈ ఏడాది మస్క్ ఆస్తి 100 బిలియన్ డాలర్లు పెరిగిందంటే టెస్లా, స్పేస్ ఎక్స్ ల పై ఎంతమంది పాజిటీవ్ గా ఉన్నారో తెలుస్తోంది పెట్టుబడుల విషయంలో.