బ్రేకింగ్ – తెలంగాణ ఎంసెట్, ఈసెట్, పాలీసెట్ ప‌రీక్ష తేదీలు ఇవే

బ్రేకింగ్ - తెలంగాణ ఎంసెట్, ఈసెట్, పాలీసెట్ ప‌రీక్ష తేదీలు ఇవే

0
123

ఈ క‌రోనా లాక్ డౌన్ తో పూర్తిగా అన్నీ రంగాలు దెబ్బ తిన్నాయి, ముఖ్యంగా విద్యార్దుల‌కి బ‌డులు కాలేజీలు కూడా ఓపెన్ అవ్వ‌లేదు, ఇక ప‌రీక్ష‌లు కూడా క్యాన్సిల్ చేసి వారిని త‌ర్వాత త‌ర‌గ‌తుల‌కి ప్ర‌మోట్ చేశారు, అయితే ఏపీలో స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తామో ప్ర‌క‌టించారు.

ఇక కేంద్రం కూడా స్కూల్లు కాలేజీలు తెరిచేందుకు ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చింది, ఈ స‌మ‌యంలో తెలంగాణ‌ స‌ర్కారు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది..తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ డిగ్రీ అడ్మిషన్లపై నిర్ణయం తీసుకుంది.

సెప్టెంబర్ 1 తర్వాత ఇంటర్ అడ్మిషన్స్ పై నిర్ణయం తీసుకోనుంది. ఎంట్రెన్స్ టెస్టులు నిర్వహించే దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. ఎంసెట్ ఎగ్జామ్ ను సెప్టెంబర్ 9,10,11,14 తేదీల్లో నిర్వహించనున్నారు. పాలీసెట్ సెప్టెంబర్ 2న జరుగనుంది. ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అన్ని టీసీఎస్ సహకారంతో ఆన్ లైన్ లో నిర్వహించనున్నారు. ఈసెట్ పరీక్ష సెప్టెంబర్ 8న నిర్వహించనున్నారు. తాజాగా దీనిపై ప్ర‌క‌ట‌న చేశారు.