ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది… కూల్ డ్రింక్ నాటు సారాలో శానిటైజర్ కలుపుని తాగి ఏకంగా పదిమంది మృతి చెందారు… మృతులలో ముగ్గురు కురిచేడు అమ్మవారి ఆలయం వద్ద బిక్షమెత్తుకునే యాచకులుగా గుర్తించారు… మద్యం ధరలు పెరగడంతో వాటికి కొనుక్కునేందుకు డబ్బులు లేక ప్రత్యామ్నాయంగా కొద్దికాలంగా శానిటైజర్ ను తాగుతున్నారు.. ఈ సంఘటనపై టీడీపీ నేత లోకేశ్ స్పందించారు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్తవ్యస్త మద్యం పాలసి, విషంలాంటి బ్రాండ్లు ప్రజల ప్రాణాలు బలితీసుకుంటున్నాయని మండిపడ్డారు… మద్యపాన నిషేధం అంటూ ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారని ఆరోపించారు… జే ట్యాక్స్ వసూళ్ల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు…
కూల్ డ్రింక్ నాటు సారా, శానిటైజర్ తాగి ప్రకాశం జిల్లా కురిచేడులో 10మంది చనిపోవడం బాధాకరం అని అన్నారు… అయితే ఈ మరణాలు ముమ్మూటికీ జగన్‌రెడ్డి సర్కారు హత్యలే అని లోకేశ్ అన్నారు.. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ లిక్కర్ మాఫియా అరాచకాలకు అడ్డుకట్ట వెయ్యాలని డిమాండ్ చేశారు…