ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..వాటికి మంత్రివర్గం ఆమోదం

0
95
CM Jagan

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఆర్సి జీవోలో చేసిన మార్పులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

కోనసీమ జిల్లాను “అంబేద్కర్ కోనసీమ” జిల్లాగా పేరు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 27న అమ్మఒడి పథకానికి నిధుల విడుదలతో పాటు అర్జున అవార్డు గ్రహీత జ్యోతి సురేఖకు గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

వచ్చే నెలలో అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలు విద్యా కానుక, కాపు నేస్తం, జగనన్న తోడు, వాహన మిత్ర పథకాలకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది.వంశధార నిధులకు రూ. 216 కోట్ల పరిహారం నిధులు విడుదల చేసేందుకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.