తెలంగాణ టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్..!

0
89

ప్రస్తుతం పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకోడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అటు ప్రైవేట్ స్కూళ్ళు పూర్తిగా ఇంగ్లీష్ మీడియానికే పరిమితం అవ్వడం, టెక్నాలజీ పెరగడంతో తెలుగు మీడియం స్కూళ్లు కనుమరుగయ్యాయి. దీనితో పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో చేర్పించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల మాతృబాష అయిన తెలుగును పిల్లలు మరిచిపోతున్నారు.

ఇక తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా కొత్త చట్టం తీసుకురావాలని టీ కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన, ప్రైవేట్‌ స్కూల్స్‌, జూ.కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ.. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.

దీనితో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనే జరగనుంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా మంది టీచర్లకు ఇంగ్లీష్ రాకపోవడంతో బోధన కష్టంగా మారుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా ఇంగ్లీష్ మీడయం వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే సర్కార్ స్కూళ్ళలో టీచర్లకు ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది.  తెలంగాణలో మొత్తం 1.02 లక్షల మంది టీచర్లు ఉండగా అందులో 25 శాతం మంది టీచర్లు మాత్రమే ఆంగ్లం నేర్చుకున్నట్టు గుర్తించారు. దాంతో మరో 75 శాతం మందికి ఇంగ్లీష్ భాషపై పట్టు పెంచాలని విద్యా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే టీచర్లకు ఇంగ్లీష్ క్లాసులు ఏర్పాటు చేస్తోంది.