రెండో ప్రపంచ యుద్ధం ఇప్పటి వారికి చరిత్ర అయి ఉండవచ్చు ఆనాటి పరిస్దితులు దారుణం అనే చెప్పాలి ,లక్షల మంది మరణించారు, లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, దేశాలకు దేశాలు నామరూపాల్లేకుండా పోయాయి.
రెండో ప్రపంచ యుద్ధం చివరన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసిన అణుబాంబులు ఎంతో విషాదం నింపాయి. 1945 ఆగస్టు ఆరున హిరోషిమాపై ఆ తరువాత మూడు రోజులకు అంటే ఆగస్టు తొమ్మిదిన నాగసాకిపై అణుబాంబులు పడ్డాయి. ఈ రెండు ఘటనల్లో అక్కడ లక్షన్నర మంది జనం చనిపోయారు.
రేడియోధార్మికత ప్రభావం కారణంగా కేన్సర్ల బారినపడ్డవారు లక్షల్లో ఉన్నారు, చాలా మంది ఆ వేడికి బూడిద అయ్యారు.తరతరాలుగా ఇతర సమస్యలు అనుభవిస్తున్న వారు ఉన్నారు, ఈ ఘోరాన్ని వారు తలచుకుంటున్నారు నేటికి, వారి ముందు తరాల వారు పడిన కష్టం ఇప్పటికీ జపాన్ తలచుకుంటుంది.