YSR తెలంగాణ పార్టీ అధికార ప్రతినిధి ఏపూరి సోమన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి నాపై దాడికి సన్నాహాలు చేస్తున్నారు. నా పై సైదిరెడ్డి అనుచరులు దాడికి యత్నిస్తున్నారన్నారు. అంతేకాదు సైదిరెడ్డి అనుచరులు ఉదయం నుంచి నన్ను ఫాలో అవుతున్నారు. స్థానిక పోలీస్ లకు సైతం సమాచారం ఉందన్నారు.
నాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పై ఉంది. నా మీద ఈగ వాలినా హుజూర్ నగర్ పోలీస్ లు భాధ్యత వహించాలి. నాకు సైది రెడ్డి శత్రువు కాదు. గెట్ల పంచాయతీ లేదు. నేను సైదిరెడ్డి కొసమో..లేక ఇంకొకరి కోసమో రాజకీయాల్లోకి రాలేదు. నేను సైదిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదు. సైదిరెడ్డే కాదు నేను 119 నియోజకవర్గాలలో తిరుగుత. స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి పై ప్రశ్నిస్తా అన్నారు.
సైదిరెడ్డి కబ్జాలు, భూ బాగోతాలు, సెటిల్ మెంట్లు లోతులకు పోతే ఇంకా చాలా ఉంది. ఆయన అవినీతిని ఈ హుజూర్ నగర్ ప్రజలే చూసుకుంటారు. నయీం లాంటి గూండాలు చంపుతం అని బెదిరించినా నా పాటను ఆపలేదు. ఎవడి పాలయ్యింది రో తెలంగాణ అని గొంతెత్తి ప్రశించా. సైదిరెడ్డి ఖబడ్దార్. నయీం లాంటోనీకే నేను భయపడలేదని పేర్కొన్నారు.