ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇదే నా విన్నపం- చంద్రబాబు

ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఇదే నా విన్నపం- చంద్రబాబు

0
78

దశాబ్దాల నుంచి వివాదానికి నిలవైన అయోధ్య కేసు అంశంపై మరి కాసేపట్లో సుప్రీం కోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వనుంది… ఈరోజు 10 గంటల 30 నిమిషాలను తుది తీర్పు ఇవ్వనుంది… ఐదు మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించనుంది…..

ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయోధ్య కేసుపై స్పందంచారు… అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే…..

తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలని చంద్రబాబు నాయుడు కోరారు. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలని అన్నారు… శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలని అన్నారు