నిండు ప్రాణాన్ని కాపాడిన ఎస్సై..భుజాలపై వేసుకొని మరీ

Essay that saved a full life .. too much to put on the shoulders

0
95

ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి ఈ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఆమె చేసిన ప్రయత్నం అందరి చేత ప్రశంసల వర్షం కురిపిస్తుంది. తమిళనాడులో వరద సహాయక చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించడమే కాదు..తాను కూడా రంగంలోకి దిగి రెస్క్యూ టీమ్‌కి సిసలైన అర్థం చెప్పారు ఆమె. ఇంతటి సాహసం చేసిన ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరిని ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఘనంగా సన్మానించారు. ఆఫీసుకు పిలిపించి ఆమెను అభినందించి, ప్రశంసా పత్రాన్ని అందించారు.

అసలు ఏం జరిగిందంటే..కుండపోత వానకు చెన్నై అతలాకుతలమైపోయింది. నిన్న టీపీ చత్రం పరిధిలో వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు రాజేశ్వరి. ఐతే స్థానిక స్మశాన వాటికలో పని చేసే ఉదయ అనే వ్యక్తి వర్షంలో తడిసి స్పృహ కోల్పోయాడు. గమనించిన స్థానికులు చనిపోయాడు అనుకుని పోలీసులకు సమాచారం అందించారు. పరిశీలించిన పోలీసులు ఉదయ బతికే ఉన్నాడని గుర్తించారు.

వెంటనే అతన్ని భుజాలపై మోసుకెళ్లి ఆటో వరకు తీసుకెళ్లారు రాజేశ్వరి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమయస్ఫూర్తితో వ్యవహరించారంటూ రాజేశ్వరిపై ప్రశంసల వర్షం  కురిపించారు నెటిజన్లు.  రాజేశ్వరి అద్భుతమైన పని చేశారని మెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజేశ్వరి హాస్పిటల్ కు తీసుకెళ్లిన వ్యక్తి సేఫ్ గా ఉన్నాడని తెలిపారు.