అసెంబ్లీ వద్ద టెన్షన్ : స్పీకర్ కు రాజీనామా ఇవ్వలేకపోయిన ఈటల… ఎందుకంటే ?

0
86

ఏకవ్యాఖ్య రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించేందుకు అసెంబ్లీ కి వెళ్లిన ఈటల రాజేందర్ కు అసెంబ్లీ స్పీకర్ కలవలేదు. కరోనా కారణంగా స్పీకర్ అసెంబ్లీకి రావట్లేడని సిబ్బంది తెలిపారు. దీంతో అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా సమర్పించారు ఈటల రాజేందర్. ఆయతోపాటు ఆయన అనుచరులు అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ ఈటలను ఒక్కరినే అసెంబ్లీలోకి అనుమతించారు పోలీసులు. తుదకు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని కూడా లోనికి అనుమతించలేదు. రాజీనామా సమర్పించిన తర్వాత అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే…

నా రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ కు అందించాలని భావించాను. కానీ ఆ అవకాశం చిక్కలేదు. నేరుగా స్పీకర్ ను కలిసి ఇద్దామనుకున్న కానీ స్పీకర్ కరోనాను అడ్డం పెట్టుకుని నన్ను కలవలేదు. అనివార్య మైన పరిస్థితుల్లో సెక్రెటరీ కి రాజీనామా లేఖ ఇచ్చాను. అసెంబ్లీ లో అంతా నియంతృత్వం నడుస్తున్నది. గతంలో ఉన్న పార్లమెంటరీ సంప్రదాయాలు స్వరాష్ట్రంలో తుంగలో తొక్కారు. మాజీ ఎమ్మెల్యే, ఉద్యమ కారుడు ఏనుగు రవీందర్ రెడ్డి ని కూడా అసెంబ్లీలోకి అనుమతించలేదు.

అసెంబ్లీ ప్రజల ఆశలను ప్రతిబింబించాలి కానీ ఇక్కడ కెసిఆర్ రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రమే అమలవుతున్నది. కెసిఆర్ ఈ రాజ్యాంగం ఎంది, ఎమ్మెల్యే ఎంపీ లు ఎంటి అనే భావనలో ఉన్నారు దాని ప్రతి బింబమే ఈరోజు మాకు ఎదురైన చేదు అనుభవం. ఈ వెకిలి చేష్టలు, నకిలీ ప్రయత్నాలు ఆపకపోతే నీకే ఎదురు తిరుగుతాయి. చిల్లర ప్రయత్నాలు సాగవు. హుజూరాబాద్ లో ఇన్నాళ్లు పెన్షన్ లేదు కానీ ఇప్పుడు ఆగ మేఘాలమీద ఎన్నికల కోసం  పెన్షలు ఇస్తున్నారు.

మాకు మద్దతు తెలపక పోతే ఆపెస్తం అని బెదిరిస్తున్నరు. హుజూరాబాద్ చైతన్యం గడ్డ ఇలాంటి వాటిని తొక్కి పడేసి ధర్మాన్ని గెలిపిస్తది. ధర్మానికి.. అధర్మానికి,  డబ్బు సంచులకి… ఆగౌరవనికి మధ్య జరిగే పోరాటం ఇది. నా డిఎన్ఎ అంతా లెఫ్ట్.. కానీ ఈ రోజు నియంత పాలన అంతం చేయాలన్న ఒకే ఒక లక్షం తో రైట్ పార్టీలో చేరుతున్. మళ్లీ గెలిచి వస్తా. ఏనుగు, తుల ఉమ, అందే బాబన్న, vk మహేశ్, కేశవ రెడ్డి, గండ్ర నళిని, సత్యనారాయణ తో పాటు అనేక మందిమి చేరుతున్నాము.

ఆ తరువాత అన్ని జిల్లాల నుండి వేలాదిగా చేరుతారు. నాకు లెఫ్ట్ సంఘాలు కూడా సంఘీభావం తెలిపాయి. RSU నుండి RSS వరకు అందరూ నియంత పాలన అంతమొందించడానికి కలిసి వస్తున్నారు. 20 ఏళ్ల తరువాత 2021 లో తెలంగాణ ఆత్మ గౌరవ ఉద్యమం మొదలు పెడుతున్నాము. కేటీఆర్ 2018 లోనే కౌశిక్ రెడ్డి కి డబ్బులు పంపించి నన్ను ఓడ గొట్టడానికి ప్రయత్నం చేశారు. నా ఇంటిమీద రైడ్ చేయించారు. ఇవన్నీ హుజూరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు. ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు అయ్యారు. బయటి వాళ్ళు ఇంటి వాళ్ళు అయ్యారు. నన్ను కాల గర్భంలో కలపాలి అనుకుంటున్నారు కానీ అది రివర్స్ అవుతుంది. నియంత పాలన అంతమై తీరుతుంది.