FLASH NEWS : హరీష్ రావుపై ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్

0
82

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ లోని తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టిఆఱ్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుపై ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ పార్టీలో తనను అనేకసార్లు అవమానాలకు గురి చేశారని చెప్పిన ఈటల తనకంటే ఎక్కువగా హరీష్ రావును అవమానించారని చెప్పారు.

కేసిఆర్ కు తనకు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చిందని కొందరు ప్రశ్నిస్తున్నారు… అసలు గ్యాప్ అనేది ఈనాడు వచ్చింది కాదు.. ఐదేళ్ల నుంచే ఉంది అని ఈటల వివరించారు. తనకంటే ఎక్కువగా హరీష్ రావు కు కూడా గ్యాప్ ఉందన్నారు.

కేటిఆర్ సిఎం అయితే తన కింద పనిచేస్తానని హరీష్ రావు కామెంట్ చేశారని అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అనేది లాలూ ప్రసాద్ పార్టీ లాగా కుటుంబ పార్టీ కాకుండా ఉంటుందనుకున్నట్లు చెప్పారు. తెలంగాణ లక్ష్య సాధనలో వెనక్కు పోతే రాళ్లతో కొట్టి చంపాలని ఆనాడు కేసిఆర్ చేసిన కామెంట్స్ ను గుర్తు చేశారు. తన బిడ్డా కొడుకులు ఇద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారని, తెలంగాణ కోసం ఉద్యమించేందుకే టిఆర్ఎస్ పార్టీ అని కేసిఆర్ అన్నట్లు చెప్పారు. కానీ నేడు కుటుంబసభ్యులే పార్టీ నిండా ఉన్నారని వివరించారు.

 

ప్రగతి భవన్ పై ఈటల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వార్త కోసం కింద లింక్ క్లిక్ చేయండి.

ప్రగతి భవన్ పైనే గురి పెట్టిన ఈటల : షాకింగ్ కామెంట్స్