ప్రగతి భవన్ పైనే గురి పెట్టిన ఈటల : షాకింగ్ కామెంట్స్

0
69

మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన గురువారం ఢిల్లీ నుంచి వచ్చారు. ఢిల్లీల బిజెపి నేతలతో చేరికపై ఒప్పందం చేసుకున్నారు.

శుక్రవారం ఉదయం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ప్రగతిభవన్ కేరాఫ్ అడ్రస్ గా విమర్శలు గుప్పించారు.

ప్రగతి భవన్ అంటే ప్రభుత్వ కార్యాలయం. అందులో ఏ ఒక్క ఎస్టీ ఐఎఎస్ అధికారికి అయినా పోస్టింగ్ ఉందా? అని ప్రశ్నించారు. అంతేకాదు ఏ ఎస్సీ అధికారి అయినా అక్కడ కొలువులో ఉన్నారా అని ప్రశ్నించారు. కనీసం ఏ బిసి ఐఎఎష్ అధికారి అయినా అక్కడ పోస్టులో ఉన్నార అని నిలదీశారు. తెలంగాణ అంటేనే అణగారిన వర్గాలకు నిలయం అని గుర్తు చేశారు.

అది ప్రగతి భవన్ కాదని… అదొక బానిస భవన్ అని ఈటల ఘాటుగా విమర్శించారు. సిఎం కేసిఆర్ ధర్మాన్ని, న్యాయాన్ని కాకుండా డబ్బు సంచులను, కుట్రలను నమ్ముకున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే సభ్యత్వానికి ఈటల రాజీనామా చేశారు.