నా ఇంట్లో అన్నం తిన్నవాళ్లతోనే తిట్టిస్తున్నారు : ఈటల జమునారెడ్డి

etala jamuna press meet etala nithin reddy press meet etala rajendar wife jamuna

0
50

తెలంగాణలో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫ్యామిలీని టిఆర్ఎస్ సర్కారు టార్గెట్ చేసిన నేపథ్యంలో ఈటల సతీమణి జమునారెడ్డి, ఆయన తనయుడు నితిన్ రెడ్డి ఆదివారం తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈటల సతీమణి భావోద్వేగంతో మాట్లాడారు. తమ ఇంట్లో అన్నం తిన్నవాళ్లతోనే తిట్టిస్తున్నారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ బిసి కమిషన్ సభ్యుడు వకులాభరణం కృష్ణ మోహన్ ను ఉద్దేశించి ఈటల జమునారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. ఇంకా ఆమె ఏమన్నారో ఆమె మాటల్లో…

నేను ఒక మహిళగా ఛాలెంజ్ చేస్తున్నాను. అక్రమాలు జరిగినట్లు నిరూపించాలి. మేము సమైక్యాంధ్రలో ఆత్మ గౌరవంతో బ్రతికినం. 2014 నుంచి ఆ పరిస్థితులు లేవు. ప్రగతి భవన్ గేట్ వద్దే మూడు సార్లు అపాయింట్మెంట్ లేదని ఆపితే ఈటెల ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉద్యమంలో ఈటెల ఖర్చు పెట్టిన డబ్బుల గురించి ఎవరైనా ఆడిగారా..? నేను వ్యాపారం చేస్తూ ఈటెలను ఉద్యమంలోకి పంపాను. నా వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా ఉద్యమంలో ఈటెల అందరిని కాపాడుకున్నారు. ఈటెల ఉద్యమంలో ఎలా ఉన్నాడో ఓయూ విద్యార్థులను అడగండి. నా ఆస్తులు అమ్మి ఐనా సరే మా ఆయనకు అండగా ఉంటా. తెలంగాణ ఆత్మ గౌరవ పోరాటంలో ఎంతకైనా సిద్ధమే.

నయీమ్ చంపుతాను అంటే భయపడలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఈటెల కు జ్వరం వస్తే అప్పటి పాలకులు వచ్చి పరామర్శించారు.. తెలంగాణ వచ్చాక ఆ పరిస్థితి లేదు. అధికారం ఉందని ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటే పోరపాటు. ఆనాడు సిఎం వైఎస్సార్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే వెళ్లని వ్యక్తిత్వం ఈటలది. ఈటలను విమర్శించే వకులాభరణం కృష్ణమోహన్ మొహం చూసి ఒక్క వోట్ పడతదా? అన్నా అని పదిసార్లు మా ఆయనను బతిలాడితే బీసీ కమిషన్ లో సభ్యుడిగా నియామకం జరిగేలా చేశారు. నా ఇంట్లో అన్నం తిన్న వాళ్ళతోనే తిట్టిస్తున్నారు.

ఉద్యమంలో ఈటెల రెండు మూడు రోజులు ఇంటికి రాకపోయినా కూడా దైర్యంగా ఉన్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితులు లేవు. ఉద్యమంలోకి రాక ముందు కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఎంత..? ఇప్పుడు ఎంత..? చర్చకు సిద్ధమేనా? పోలీసులు మా కుటుంబం కోసమే పని చేస్తున్నారా? సమైక్య పాలనలో కూడా ఇన్ని ఇబ్బందులు లేవు. రెడ్డి-ముదిరాజ్ లమని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా..? కులాల పేరుతో పాలన చేస్తున్నారు. అసత్య ప్రచారాలు ఎక్కువ కాలం నిలబడవని కేసిఆర్ ను హెచ్చరించారు.