ఈటల రాజేందర్ రియల్ స్టోరీ

ఈటల రాజేందర్ రియల్ స్టోరీ

0
79
Eatala Rajender

ఈటల రాజేందర్ ఈ పేరు తెలియని వారు ఉండరు, ఇప్పుడు తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ఈ పేరు తెగ వినిపిస్తోంది, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆయన పదవిని కోల్పోయారు.. భూ కబ్జా ఆరోపణలతో ఆయన తన మంత్రి పదవిని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే అసలు ఈటల రాజేందర్ రియల్ స్టోరీ చూద్దాం.

ఈటల రాజేందర్ మార్చి 20, 1964 లో జన్మించారు.

ప్రాధమిక మాధ్యమిక విద్య అంతా సంక్షేమ హాస్టల్ లో ఉండి చదువుకున్నారు

ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఆయన బీఎస్సీ పూర్తి చేశారు

ఆయనకు భార్య జమున, కొడుకు నితిన్ రెడ్డి, కూతురు నీతా రెడ్డి ఉన్నారు.

బీసీ నేత పింక్ పార్టీలో కీలక నేత

రాజకీయాల్లోకి రాకముందు ఆయన గుమస్తాగా పనిచేశారు ఫౌల్ట్రీలో అంటారు అక్కడ వారు

ఆయన తక్కువ ధరకే ఆ సమయంలోనే భూములు కొని కోళ్ల ఫారాలు పెట్టారు

ఇప్పుడు పది లక్షల కోళ్ల తో ఫారాలు ఉన్నాయి అంటారు.

ఆ సమయంలో తెలంగాణలో మలి ఉద్యమం ఊపు అందుకుంది

ఇక పోరాటాల గడ్డ కరీంనగర్ నుంచి ఆయన ముందుకు వచ్చారు

కేసీఆర్ తో చేతులు కలిపారు. టీఆర్ ఎస్ పార్టీ స్ధాపించిన సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉన్నారు.

ఉద్యమ సమయంలో కమలాపూర్ నుంచి గెలిచారు

ఇక టీఆర్ ఎస్ పార్టీకి ఫ్లోర్ లీడర్ గా చేశారు

తర్వాత హుజూరాబాద్ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు

నాలుగు సార్లు ఎమ్మెల్యే గా గెలిచారు ఆయన

తెలంగాణ తొలి ఆర్దిక మంత్రిగా పనిచేశారు

2001 నుంచి టీఆర్ ఎస్ పార్టీలో ఉన్నారు

ఆయన 2004 ఎన్నికల్లో కమలాపూర్ నుంచి గెలిచారు

2014 లో ఆర్దిక శాఖ మంత్రిగా చేశారు…

2019 లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు.