రాయలసీమలో పవన్ పర్యటన వివరాలు… ఎవరెవరిని కలువనున్నారో క్లుప్తంగా

రాయలసీమలో పవన్ పర్యటన వివరాలు... ఎవరెవరిని కలువనున్నారో క్లుప్తంగా

0
125

ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమలో అడుగుపెట్టనున్నారు… డిసెంబర్ ఒకటినుంచి ఆయన ఆరోజులు అక్కడే ఉంటారు… అందుకు కావాల్సిన ఏర్పాట్లను కూడా పార్టీనేతలు సిద్దం చేస్తున్నారు…

చిత్తూరు కడప అనంతపురం జిల్లాల్లో పవన్ పర్యటించనున్నారు అక్కడ రైతాంగం మేధావులతో చర్చలు చేపడతున్నారు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు మౌలిక సదుపాయాల కల్పనలో సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడంలో పాలక పక్షం చూపిస్తున్న నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించనున్నారు పవన్…

పవన్ సీమ టూర్ వివరాలు…..

డిసెంబర్ 1న మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రమంకు చేరుకుంటారు.. అక్కడనుంచి కడప జిల్లాకు వెళ్తారు… 3 గంటలకు రైల్వే కోడూరు చేరుకుని కడప జిల్లా రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలపై చర్చిస్తారు… 2వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుపతి చిత్తూరు పార్లమెంట్ పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులతో సమీక్ష నిర్వహిస్తారు…

3న కడప రాజంపేట పార్లమెంట్ అపరిధిలోకి వచ్చే అభ్యర్ధులతో సమీక్షా 4 మదనపల్లిలో టూర్… పార్టీ కార్యకర్తలతో దిశ దశ… 5న అనంతపురం జిల్లాలో రైతులు , చేనేత కార్మికులతో చర్చ… 6న జిల్లాలో పార్టీ నాయకులు కేసులబారీన ఇబ్బంది పడుతున్న వారికి భరోసా…