ప్రతి మహిళ ఫోన్ లో ‘దిశ’ యాప్‌ ఉండాలి: సీఎం జగన్

0
127

లా అండ్‌ ఆర్డర్‌పై క్యాంప్‌ కార్యాలయంలో ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దిశ అమలు, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులు, రాష్ట్రంలో నేరాల నిరోధం–తీసుకుంటున్న చర్యలు, పోలీసు బలగాల బలోపేతం, మాదకద్రవ్యాల నిరోధం తదితర అంశాలపై సీఎం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకూ 74,13,562 ‘దిశ’ యాప్‌ను డౌన్‌లోడ్స్‌ చేశారని పోలీసు అధికారులు వెల్లడించారు. దిశ యాప్‌ ద్వారా 5238 మందికి సహాయం అందింది. దిశ యాప్‌ ద్వారా రిజిస్టర్‌ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు 2021లో 684గా ఉన్నాయి.

ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ..‘దిశ’ చాలా సమర్థవంతంగా అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ఫోన్లో దిశ యాప్‌ ఉండాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ‘దిశ’పై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి మహిళ చేతిలో ఉండే ఫోన్లో ‘దిశ’యాప్‌ డౌన్లోడ్‌ కావాలన్నారు.