ఈ కుక్క విశ్వాసం చూసి కన్నీరు వస్తుంది అందరికి

-

నిజమే ఈ ప్రపంచంలో కుక్కకున్న విశ్వాసం మరే జంతువుకు ఉండదు. అందుకే మనిషికి మంచి స్నేహితులుగా కుక్కలు మారిపోతాయి.. వాటిని అంత ఇష్టంగా ప్రేమగా చూసుకుంటారు, యజమాని కనిపించకపోతే అస్సలు తట్టుకోలేవు ఆహారం కూడా తీసుకోవు.. ఇలా ఎన్నోసార్లు మనం చూశాం.. అయితే ఇప్పుడు ఉత్తరాఖండ్ వరద వచ్చిన ప్రాంతంలో ఓ కుక్క అక్కడే ఉంటోంది..ఎందుకు అది అలా ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

తపోవన్ డ్యామ్ టన్నెల్ దగ్గర కొందరు గల్లంతు అయ్యారు, అయితే అందులో పని చేసే కార్మికులు ఈ కుక్కతో ఎంతో బాగా ఉండేవారు, వారు తినే అన్నం రోజూ దీనికి కొంచెం పెట్టేవారు… వారు పని చేసుకునే సమయంలో వారితోనే అది ఉండేది ఇలా వారికి దానికి ఎంతో మంచి బంధం ఏర్పడింది.

తనను రోజూ పలకరించి అన్నం పెట్టే కార్మికులు కనిపించకపోవడంతో ఆకుక్క వారి కోసం ఎదురుచూస్తోంది.. లోపల నుంచి వారు వస్తారు అని ఆశగా అక్కడే ఉంటోంది. అయితే దానికి ఆహారం పెడుతున్నా ఇప్పుడు తీసుకోవడం లేదు.. వారి కోసం ఎదురుచూస్తోంది.. ఈ సంఘటన చూసి అందరికి కన్నీళ్లు వస్తున్నాయి. ఆ కుక్క పేరు బ్లాకీ అని చెబుతున్నారు స్ధానికులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...