ఫ్లాష్ ఫ్లాష్ ….మాజీ సీఎంకు అస్వస్థత

ఫ్లాష్ ఫ్లాష్ ....మాజీ సీఎంకు అస్వస్థత

0
103

యూపీ రాజకీయ నేతలకు ముఖ్యంగా సమాజ్ వాదీ పార్టీ నేతలు కంగారులో ఉన్నారు. అవును ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అస్వస్థతకు గురయ్యారు… ఈ వార్త తెలియగానే అందరూ కంగారుపడ్డారు …మా గురువుకి ఏమైంది అని రాజకీయంగా ఆయన శిష్యులు కంగారు పడ్డారు.

యూపీ రాజకీయాల్లో సీనియర్ లీడర్ మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఎంతో పేరు ఉంది.. దేశంలోనే అతిపెద్ద స్టేట్ కు రూలర్ గా ఆయన ఉండేవారు. ఆయన ఆరోగ్యానికి సంబంధించి కొన్ని రోజులుగా పొత్తికడుపు సంబంధింత సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని తెలుస్తోంది., దీంతో వెంటనే ఆయనని ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు.

మూడు రోజులుగా చికిత్స పొందుతున్న ములాయంను ఈరోజు డిశ్చార్జి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ అక్కడ విజయం సాధించింది.. అంతకుముందు అక్కడ యూపీ సీఎంగా అఖిలేష్ యాదవ్ అంటే ములాయం కుమారుడు సీఎంగా పనిచేసిన విషయం తెలిసిందే.