రాజీనామా ఆమోదించగానే కేసిఆర్ కు క్లాస్ పీకిన ఆర్ఎస్ ప్రవీణ్  కుమార్

0
100

మాజీ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా ఆమోదం పొందగానే తెలంగాణ సిఎం కేసిఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కేసిఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఆయన మాటల్లోనే…

నేను పదవి విరమణ చేసి వచ్చిన తెల్లారే కరీంనగర్ లో నాపై పోలీస్ కేస్ పెట్టారు. వాటికి నేను అస్సలు భయపడను. సీఎం హుజరాబాద్ లో ఖర్చు పెట్టే వెయ్యి కోట్లు  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలి. 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ లలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారు జాగ్రత్త. బహుజన రాజ్యం సృష్టించుకుంటాము.

దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం మోసం చేస్తారు. అలాంటివి మళ్ళీ రానీయకండి. ఇటువంటి అవకాశము వెయ్యి ఏళ్ళు వరుకు రాదు. స్వాతంత్ర్యము వచ్చి 75 ఏళ్ళు అయింది, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళి లా ఉంది. ఆ బతుకులు మార్చడానికే నేను రాజీనామా చేసి త్యాగం చేసి వచ్చాను.

మాకు నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం కావాలి. మీ బిడ్డ గా ప్రశ్నించడానికి నేను  రాజీనామా చేసి వచ్చాను. ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబము లో చాలా బాధ ఉంటుంది. కోట్ల మంది బాగుపడాలనే నేను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.