తోక మీద కొట్టి వదిలిపెట్టొద్దు.. చాలా డేంజర్

0
99

హుజూరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చేలా గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా శుక్రవారం హుజూరాబాద్ లో పని చేసిన వివిధ కులసంఘాల ప్రతినిధులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయనేమన్నారో చదవండి.

ప్రపంచంలో అత్యధిక ఖర్చు పెట్టిన ఎన్నికలు ఇవే.

రానున్న రోజుల్లో దీన్ని కెసిఆర్ తెలంగాణ అంతటా చేస్తాడట.

సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది.

ఒకనాడు రాజకీయాలు సర్వీస్ కోణంలో ఉండే కానీ కెసిఆర్ వ్యాపారం చేశారు.

డబ్బులు ఇచ్చి పసుపు కుంకుమ మీద, కుల దేవతల మీద ప్రమాణం చేయించారు.

నాకు నరకం చూపించారు.

అస్తిత్వం, త్యాగశీలత, ఆత్మగౌరవం కి మారుపేరు తెలంగాణ ఉండే.. కానీ ఇప్పుడు డబ్బుల తెలంగాణ చేశారు కెసిఆర్.

గొంతుఎత్తిన ప్రతి ఒక్కరినీ ఖతం పట్టిస్తున్నారు.

మొన్న ఎన్నికల్లో ప్రజలంతా ధర్మం కోసం అండగా ఉన్నారు.

ఈ ప్రభుత్వం కొనసాగటం ఈ సమాజానికి అరిష్టం.

ప్రజలారా ఇంకా అలసత్వం వద్దు సీరియస్ గా స్పందించాల్సిన సమయం వచ్చింది.

తోక మీద కొట్టి వదిలిపెట్టవద్దు.

అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు.

కెసిఆర్ నే మిమ్ముల్ని మాకు ఆయుధంగా అందించారు అని వారు చెప్తున్నారు.