ఈటల బిజెపిలో చేరేది లేకుండే : టిఆర్ఎస్ లోనే ఉండాల్సిండే : మాజీ మంత్రి కామెంట్

0
86

మాజీ మంత్రి ఈటేలా రాజేందర్ బిజెపిలో చేరకుండా ఉంటే బాగుండేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అలా కాని పక్షంలో కేసీఆర్ తో మాట్లాడుకుని తెరాస లోనే కంటిన్యూ అయితే బాగుండేదని జీవన్ రెడ్డి సూచించారు. ఈటల రాజేందర్ బిజెపిలో చేరడాన్ని జీవన్ రెడ్డి తప్పుపట్టారు.

జగిత్యాలలో జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగడానికి బీజేపీ సహకరిస్తుందని ఆరోపించారు. స్వతంత్రంగా పోరాటం చేసిఉంటే తెలంగాణ వాదులు ఈటేల కు అండగా ఉండేవారని పేర్కొన్నారు. ప్రగతిశీల భావాలంటే ఇవేనా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.

ఈ మీడియా సమావేశంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లీ దుర్గయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కాంగ్రెస్ నాయకులు దేవేందర్ రెడ్డి, బండ శంకర్, గాజుల రాజేందర్, గుంటి జగదీశ్వర్, జున్ను రాజేందర్, లైశెట్టి విజయ్ తదితరులు పాల్గొన్నారు.