మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదరేరారు. ఆయన ఢిల్లీలో బిజెపి అగ్రనేతలతో భేటీ కానున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షలు జెపి నడ్డాతో భేటీ కానున్నారు. అలాగే హోమంత్రి అమిత్ షా ను కూడా కలుస్తారని ఈటల సన్నిహితులు చెబుతున్నారు.
ఈటల ఢిల్లీ టూర్ పట్ల తెలంగాణ రాజకీయ వర్గాలు ఆసక్తిని చూపుతున్నాయి. ఈటల బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారని ఇప్పటికే ప్రచారం సాగింది. బహుషా రేపు, లేదా ఎల్లుండి ఈటల కమల తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా తెలుస్తోంది. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు.
అయితే ఈటల రాజేందర్ తో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటైన నాటినుంచి ఆ పార్టీలో ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు. ఆయన కూడా బిజెపి కండువా కప్పుకోనున్నారు. రెండోసారి టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఏనుగు రవీందర్ రెడ్డి జాజాల సురేందర్ మీద ఓటమిపాలయ్యారు. అనంతరం ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా జాాజాల సురేందర్ టిఆర్ఎస్ లో చేరారు. దీంతో ఏనుగు కు ఊపిరి మెసలడంలేదు. అధిష్టానం ఏనుగును నిర్లక్ష్యం చేయడంతో ఆయన టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరనున్నారు.