రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి ఏమిటి అంటే .దేశంలోని 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. ఏపీ బీజేపీ మాజీ ఎంపీ హరిబాబును మిజోరం గవర్నర్గా నియమించారు. ఆయనకు సముచిత స్ధానం దక్కింది. కొద్ది రోజులుగా ఆయనకు గవర్నర్ పదవి వస్తుంది అని వార్తలు వినిపించాయి. తాజాగా ఆయనను గవర్నర్ గా నియమించారు
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ.. హర్యానా గవర్నర్గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాత్కు గవర్నర్ పదవి లభించింది. ఆయనను కర్ణాటక గవర్నర్గా నియమించారు.ఇక ఈ నిర్ణయంతో కచ్చితంగా కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుంది అనేది అర్దమవుతోంది.
1. మిజోరం గవర్నర్గా కుంభంపాటి హరిబాబు
2. హర్యానా గవర్నర్గా బండారు దత్తాత్రేయ – ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఆయన ఉన్నారు
3. త్రిపుర గవర్నర్గా సత్యదేవ్ నారాయణ్- ప్రస్తుతం హర్యానా గవర్నర్గా ఉన్నారు
4. మధ్యపద్రేశ్ గవర్నర్గా మంగూభాయి పటేల్
5. హిమచల్ప్రదేశ్ గవర్నర్గా -రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్
6. గోవా గవర్నర్గా ఎస్ శ్రీధరన్ పిళ్లై – ప్రస్తుతం మిజోరం గవర్నర్గా ఉన్నారు
7.కర్ణాటక గవర్నర్గా థావర్ చంద్ గెహ్లాత్ –ప్రస్తుతం కేంద్ర మంత్రి
8.జార్ఖండ్ గవర్నర్గా రమేష్ బయాస్ — ప్రస్తుతం త్రిపుర గవర్నర్గా ఉన్నారు