ఫ్రోజెన్ ఫుడ్ ని ప్యాక్ చేసేప్పుడు కరోనా వైరస్ ఉంటే అది ఇతరులకి సోకే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు, అయితే ఇది అందులో ఎంత కాలం ఉంటుంది అనేది మాత్రం పరిశోధన చేయాల్సి ఉంటుంది. దీనిని తాజాగా చైనాలోని డిసీజ్ కంట్రోల్ అథారిటీ తెలిపింది.
ఫ్రోజెన్ ఫుడ్ యొక్క ప్యాకేజింగ్ పైన లివింగ్ కరోనా వైరస్ ని డిటెక్ట్ చేశారు. ఇందువల్ల కరోనా వైరస్ ఫ్రోజెన్ గూడ్స్ ద్వారా ఎక్కువ దూరాలు ప్రయాణించగలదని తెలిసింది. అయితే దీనిపై వైరస్ ఆనవాళ్లు ప్యాకేజింగ్ సమయంలో వచ్చాయా ,లేదా ఎవరైనా ప్రాసెస్ చేసే సమయంలో రవాణాలో ముట్టుకుంటే వచ్చాయా అనేది తేలాల్సి ఉంది.
గతంలో పరిశోధనల్లో కూడా వైరస్ చాలా తక్కువ శాతంలోనే ఉందనీ చెబుతున్నారు, ఈ శాంపిల్స్ పరిశీలన చేస్తున్నారు, అయితే ఈ వైరస్ బతికి ఉంటే ఇతరులకి సోకే ప్రమాదం ఉంది.. లేకపోతే సోకే ప్రమాదం లేదు అంటున్నారు నిపుణులు..
ఈ వైరస్ స్కిన్ మీద తొమ్మిది గంటల పాటూ ఉండగలదనీ చెబుతున్నారు, మీరు బయటకు వెళ్లి ఏదైనా ముట్టుకున్నా దాదాపు సబ్బుతో చేతులు కడుక్కోవాలి అని శానిటైజర్ వాడాలి అని చెబుతున్నారు వైద్యులు.