ఆఫ్గన్ లో మహిళలకు ఎదురుడబ్బు ఇచ్చి మరీ బలవంతపు వివాహాలు

Extremely forced marriages for women in Afghanistan

0
93

ఆఫ్గనిస్థాన్ లో మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాలిబన్ల పాలన వస్తే మళ్లీ మన పరిస్దితి ఏమిటి అని ముందు నుంచి భయపడ్డారు. అయితే ఆ దేశం విడిచి వేరే దశాలకు వెళ్లాలి అని చాలా మంది డిసైడ్ అయ్యారు. అంతేకాదు వెళ్లిపోయారు కూడా. మరికొందరు వెళ్లలేక అక్కడే ఉండిపోయారు. తమ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలి అని కాబూల్ ఎయిర్ పోర్ట్ బాట పట్టారు.

అయితే తాజాగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. తమ పిల్లల భవిష్యత్తు జీవితం బాగుండాలని
కొందరు మహిళలు, యువతులకు కాబూల్ ఎయిర్ పోర్ట్ బయటే బలవంతపు పెళ్లిళ్లు చేశారని అమెరికా అధికారులు తాజాగా వెల్లడించారు. ఇలా కొందరు అమెరికాలో అడుగుపెట్టారు అని అంటున్నారు. యూఏఈలో ఏర్పాటు చేసిన క్యాంప్ లో కూడా కొందరు ఉంటారు అని అంటున్నారు.

క్యాంపులో ఉన్న అమ్మాయిలు ఈ విషయం చెప్పడంతో తెలిసిందే. కొందరికి ఆ పెళ్లిళ్లు ఇష్టం లేకపోయినా వారి భవిష్యత్ దృష్ట్యా తల్లిదండ్రులు బలవంతంగా వారికిచ్చి వివాహం జరిపించారు. ఇంకొందరు ఎదురు డబ్బు ఇచ్చి ఈ విధంగా పెళ్లి చేసి పంపించారట. వారి బాధలు విని అందరూ చలించిపోతున్నారు.