ఫేస్ బుక్ యూజర్లకు మరో గుడ్ న్యూస్ సరికొత్త యాప్

ఫేస్ బుక్ యూజర్లకు మరో గుడ్ న్యూస్ సరికొత్త యాప్

0
95

ఇప్పుడు టిక్ టాక్ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, రోజు పదలు సంఖ్యలో వీడియోలు పోస్ట్ చేసేవారు బాధలో ఉన్నారు, అయితే ఈ సమయంలో టిక్ టాక్ వస్తుందా రాదా అనే అనుమానం కూడా అందరికి కలుగుతోంది, అయితే ఈ సమయంలో రెండు నెలలుగా ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది.

అందుకే ఫేస్ బుక్ సరికొత్తగా ఆలోచన చేస్తోంది. తాజాగా ఫేస్ బుక్ టిక్ టాక్ తరహాలోనే ఓ యాప్ ను లాంచ్ చేసేందుకు సిద్ధం అయ్యింది. ఇది ఫేస్ బుక్ తోనే అనుసంధానం అయ్యి ఉంటుంది. పేస్ బుక్ లో న్యూస్ ఫీడ్ బటన్ ను క్లిక్ చేస్తే కెమెరా ఆన్ అవుతుంది.

ఇక మీరు వీడియోలు షూట్ చేసుకోవచ్చు అప్ లోడ్ చేసుకోవచ్చు, మీకు టైమ్ లిమిట్ కూడా ఉంటుందట, అనేక ఫీచర్లు ఇందులో అందుబాటులోకి తీసుకువస్తారు, ఇక ఇండియాలో దీనిపై టెస్టింగ్ అయితే జరుగుతోంది, త్వరలో దీనిని యూజర్లకు అందుబాటులో తీసుకువస్తారు అని తెలుస్తోంది.