ఫేస్‌బుక్ లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్

ఫేస్‌బుక్ లో మ‌రో స‌రికొత్త ఫీచ‌ర్

0
132

ఫేస్ బుక్ లో ఇప్ప‌టికే అనేక కొత్త ఫీచ‌ర్లు వ‌చ్చాయి, ఇంకా స‌రికొత్త నూత‌న ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ పెట్టే ఆలోచ‌న‌లో ఉంది ఫేస్ బుక్, తాజాగా కీల‌క విష‌యం ప్ర‌క‌టించింది, స‌రికొత్త ఫీచ‌ర్ ని ఆవిష్క‌రించింది.
ఇకపై అధికారిక మ్యూజిక్ వీడియో లను ఫేస్‌బుక్ లో అందించనుంది. ఈ సేవలను అమెరికా సహా ఇండియా లో కూడా ఫేస్‌బుక్ ప్రారంభించింది.

ఇండియాలో ప్ర‌ముఖ కంపెనీ టీ-సిరీస్, జీ మ్యూజిక్, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి కంపెనీలు ఫేస్‌బుక్ తో కలిసి పనిచేయనున్నాయి. దీంతో ఫేస్‌బుక్ యూజర్ల కు సరికొత్త అనుభూతి ల‌భిస్తుంది, ఇక స‌రికొత్త‌గా మ్యూజిక్ ఎక్స్ పీరియ‌న్స్ అందిస్తామ‌ని.

యూజ‌ర్ల‌కు మ‌రింత చేరువ అవుతాము అని అంటున్నారు కంపెనీ ప్ర‌తినిధులు, ఇక ఫేస్ బుక్ కి ఒక్క‌సారి లాగిన్ అయితే స‌మ‌స్తం ఒకే వేదిక‌లో ఉండేలా నూత‌నంగా మారుస్తుంది అంటున్నారు యూజ‌ర్లు..న్యూస్ ఫీడ్ లో భాగంగా వీక్షించవచ్చు. ఫేస్ బుక్ వాచ్ అనే సరికొత్త ఆప్షన్ ద్వారా కూడా అధికారిక మ్యూజిక్ వీడియోలు చూడ‌వ‌చ్చు.