ఎవరైనా ఇకపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి తప్పుడు ఫిర్యాదులు ఇచ్చినా, కట్టుకధలు చెప్పినా వారికి ఇక జైలు శిక్ష తప్పదు, పోలీసులది ఎంతో విలువైన సమయం… ఎన్నో కేసులు పెండింగ్ ఉంటాయి, కాని వారి పనికి ఇలాంటి కేసులతో ఆటంకం కలిగిస్తున్నారు కొందరు.. ఇక వారిపై కొరడా ఝులిపిస్తారు, ఎవరైనా పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేస్తే, కట్టు కథలు చెబితే, హైడ్రామాలు సృష్టిస్తే జైలుకు వెళ్లక తప్పుదు.
హైదరాబాద్ లోని బీ.ఫార్మసీ విద్యార్థిని అల్లిన కట్టుకథ తెలిసిందే పోలీసులని ప్రజలను పరేషాన్ చేసింది.. కావాలనే డ్రామాలు ఆడింది, దీంతో మూడు రోజులు ఈ కేసు గురించి పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు, చివరకు ఆమె చెప్పింది విని అందరూ షాక్ అయ్యారు, ఇక ఇలాంటి పని ఎవరైనా చేస్తే వారిపై సెక్షన్ 193 కింద పోలీసులు కేసు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టనున్నారు.
ఫిర్యాదు, హైడ్రామా సృష్టికర్తలపై ఐపీసీ 193 కింద చర్యలు తీసుకునే అవకాశం పోలీసులకు ఉంది. సో విచారణ చేసి ఇలాంటి పని చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాము అంటున్నారు పోలీసులు.. ఇలా నేరం రుజువు అయితే వారికి దాదాపు ఏడేళ్ల జైలు లేదా జరిమానా భారీగా విధిస్తారు.
|
|
|
పోలీస్ స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు ఇచ్చినా – కట్టుకధలు హైడ్రామాలు చేసినా ఇక జైలు శిక్షే
-