బ్రేకింగ్: బీజేపీలోకి ప్రముఖ సినీ నటి..ఈటల మాస్టర్ ప్లాన్!

0
64

తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన రాజగోపాల్ రెడ్డి త్వరలో బీజేపీ చేరనుండగా..తాజాగా ప్రముఖ సీనియర్ సినీ నటి జయసుధ బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర ప్రసాద్ తో జయసుధ భేటీ అయినట్లు తెలుస్తోంది. మునుగోడులో అమిత్ షా సమక్షంలో జయసుధ కాషాయ కండువా కప్పుకోనున్నారని సమాచారం. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న జయసుధ ఇప్పుడు ఈటల మాస్టర్ ప్లాన్ తో బీజేపీలో చేరనున్నారు.