కేంద్రంలో ఉన్న నరేంద్రమోదీ సర్కారు, PM KISAN సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. రైతులకి ఇది ఎంతో గొప్ప పథకం. 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది తాజాగా.ఈ PM KISAN పథకం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
దేశంలో ఉన్న రైతులకి పీఎం కిసాన్ పథకం కింద ఏడాదికి రైతుల ఖాతాల్లో రూ.6000 జమ చేస్తారు. ఇది ఏడాదికి మూడు విడతులుగా ఇస్తారు, ఒక్కోసారి రెండు వేలు చొప్పున ఇలా మూడు సార్లు నగదు ఇస్తారు.
ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున నగదును రైతుల ఖాతాలో జమ చేస్తారు.
పొలం యజమానులకు మాత్రమే ఈ నగదు అందుతుంది.
దేశంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే ఈ ఫథకం వర్తిస్తుంది.
రైతుల ఎంపిక బాధ్యత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చూస్తాయి
www.pmkisan.gov.in అనే వెబ్ సైట్ లో మీ పేరు నమోదు చేసుకోవాలి
ఇన్ కం ట్యాక్స చెల్లించే రైతులకు మాత్రం ఇది వర్తించదు.
రైతులు స్దానికంగా ఉన్న తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేసుకోవాలి.
అక్కడ కచ్చితంగా పీఎం కిసాన్ నోడల్ అధికారి ఉంటారు.
ఇలా www.pmkisan.gov.in వెబ్సైట్లో కూడా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.