ఫ్లాష్ న్యూస్ …ఎస్సీ ఎస్టీలకు ఇక నెలకి 1000 బ్యాంకులో నేరుగా డిపాజిట్

ఫ్లాష్ న్యూస్ ...ఎస్సీ ఎస్టీలకు ఇక నెలకి 1000 బ్యాంకులో నేరుగా డిపాజిట్

0
101

ఎన్నికల వేళ ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఎలాంటి తాయిలాలు ప్రకటిస్తాయో తెలిసిందే, వచ్చే ఏడాది మమత కోటలో ఎన్నికలు జరుగనున్నాయి.. ఇక్కడ రాజకీయ వేడి అప్పుడే మొదలైంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా రాజకీయంగా వ్యూహాలకు రెడీ అవుతున్నారు, అంతేకాదు ప్రభుత్వ పాలన ఆమె చేతిలో ఉంది.. అందుకే వరాలు కూడా కురిపిస్తున్నారు అక్కడ ప్రజలకు.

పేదవారికి ఉచిత విద్యుత్ ను అందిచబోతున్నట్టు ప్రకటించింది మమతా సర్కార్ . అయితే ఇది కేవలం 3 నెలల్లో 75 యూనిట్లు వినియోగించే వారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఉచిత విద్యుత్ కోసం 200 కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. తాజాగా పశ్చిమబెంగాల్ బడ్జెట్ పూర్తి అయింది అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ..ఎమ్ ఎస్ ఎమ్ ఈ పార్కులు ఉద్యోగల కల్పన కోసం సుమారు రూ.5000 కోట్లను కేటాయించింది. ఇవన్నీ కూడా ఉద్యోగాల కల్పన కోసం ప్రవేశపెట్టినవే.

అంతేకాదు ఎక్కడా లేని విధంగా ఎస్సి ఎస్టీలకి పెన్షన్ స్కీంను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వృద్దులకు ప్రతీనెలా రూ.1000 ఇవ్వనున్నారు. ఇవన్నీ కూడా వచ్చ ఏడాది ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన స్కీమ్స్ అంటున్నారు.