ఫ్లాష్ న్యూస్ ….కత్తిమహేష్ పై కర్రలతో దాడి

ఫ్లాష్ న్యూస్ ....కత్తిమహేష్ పై కర్రలతో దాడి

0
98

కత్తిమహేష్ వివాదాలతోనే ఆయన సావాసం చేస్తున్నాడు.. బిగ్ బాస్ రియాల్టీ షో, ఆ తర్వాత పవన్ కల్యాణ్ పై విమర్శలతో మరింత సోషల్ మీడియా స్టార్ అయ్యారు కత్తి మహేష్ , తాజాగా ఆయనపై విపరీతమైన విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి ఇటీవల ఓ కార్యక్రమంలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీనిపై చాలా మంది పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారు.

తాజాగా కత్తిమహేష్ పై కర్రలతో దాడి జరిగిందట.. హైదరాబాద్ లో కొందరు తనపై దాడి చేశారు అని కత్తి మహేష్ నేరుగా పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాడు, తాను ఐమాక్స్ లో సినిమా చూసి వస్తున్న సమయంలో కొందరు తనపై దాడి చేశారని సైఫాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశారు.

ఈ దాడిలో కత్తి మహేశ్ కారు ముందు భాగంలోని అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. కత్తి మహేష్ ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలుగా భావిస్తున్నారు. అయితే ఇటీవల రాముడి గురించి చేసిన వ్యాఖ్యల వల్లే ఇలా దాడికి పాల్పడ్డారు అని తెలుస్తోంది.. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు.