ఈ ఏడాది ఏపీలో అమ్మఒడి పథకం నగదు జమ అయింది..రెండో విడత జగనన్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించింది జగన్ సర్కారు, మొత్తం ఏపీలో 44లక్షల 48వేల మంది తల్లుల ఖాతాలో రూ.6,673 కోట్లు జమ చేసింది సర్కారు. మొత్తం 84 లక్షల మందికి లబ్ది చేకూరనుంది.
ఏపీలో పిల్లలను బడికి పంపుతున్న ప్రతి తల్లి ఖాతాలో రూ.14వేల చొప్పున జమవుతున్నాయి… నిన్నటి నుంచి అందరికి నగదు జమ అవుతోంది (సోమవారం ), 15 వేల రూపాయలు జమ అవ్వాలి అయితే పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం వెయ్యి రూపాయలను టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్ కు బదిలీ చేసింది. దీంతో 14వేలు జమ అవుతున్నాయి.
ఇక మీకు బ్యాంకు ఖాతాలో నగదు జమ అయిన వెంటనే ఎస్ ఎమ్ ఎస్ వస్తుంది.. ఒకవేళ నగదు పడకపోతే మరి ఎలా అంటే..
ప్రభుత్వం ప్రత్యేక ఫోన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంక్ అధికారులతో మాట్లాడి SMS అలెర్ట్ నెంబర్లను ప్రజలకు అందించింది. మీ బ్యాంకు ఖాతాకు మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి ఇలా ఉంటే మీరు ఈ బ్యాంకు వారికి మిస్డ్ కాల్ ఇస్తే
నగదు జమ అయింది లేనిది తెలుస్తుంది
ఆంధ్రా బ్యాంక్ -09223011300
బ్యాంక్ ఆఫ్ బరోడా -09223011311
సిండికేట్ బ్యాంక్ -09664552255
బ్యాంక్ ఆఫ్ ఇండియా-09015135135
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-09223766666