మనకు తెలిసిన వారే కదా అని మనం బైక్ కారు ఇస్తూ ఉంటాం… కాని ఇకపై జాగ్రత్త సుమా, పోలీసులు అనేక విషయాలు తెలియచేస్తున్నారు.. ముఖ్యంగా బైక్ – కారు మీదే అవ్వచ్చు కాని మీరు వేరే వారికి బైక్ కారు ఏదైనా పనిమీద ఇచ్చారు అనుకోండి.. వారు ఏ రూల్ అతిక్రమించినా శిక్ష మీకే పడుతుంది ఫైన్లు మీరు కట్టాల్సిందే.
డ్రంకన్ డ్రైవ్ చేసినా, ఇంకా ఏదైనా మిస్టేక్ చేసినా అది మీకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇక వారు సిగ్నల్ జంప్ చేసినా ఆ బైక్ ఎవరి పేరు మీద ఉంది చూసి వారికి చలాన్లు వేస్తారు… సో ఇకపై మీరు బైక్ కారు ఇస్తే జాగ్రత్త, డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడితే మీపై అంటే బండి ఓనర్ పై కూడా పోలీసులు యాక్షన్ తీసుకోనున్నారు.
మీరు రూల్స్ పాటించకపోతే వాహనదారుల లైసెన్స్లను సస్పెండ్ చేస్తారు…డ్రంకన్ డ్రైవ్లో చిక్కిన వారిని ఫస్ట్ రెస్పాండెంట్గా, ఓనర్ను సెకండ్ రెస్పాండెంట్గా నమోదు చేస్తున్నారు…ఇలాంటి కేసుల్లో వాహన యజమానికి రూ.5 వేలు జరిమానా విధిస్తున్నారు.